టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆదివారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మియామీలో క్రికెట్ అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది. మియామి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన నగరమైన లాడర్‌హిల్‌లో భారత్- వెస్టిండీస్ మధ్య ఐదవ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు చాహాల్ భార్య ధనశ్రీ వర్మ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని ఆటను చూసింది.
అదే విషయాన్ని ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. భారత క్రికెటర్ల పట్ల మయామిలోని ప్రేక్షకులకు ఉన్న అభిమానం చూసి ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో మయామిలో మ్యాచ్ అంటే.. ఇంత డెడికేషన్, అద్భుతమైన అభిమానులను చూసి ఆశ్చర్యపోయాను అని ధనశ్రీ రాసింది. బ్రాండన్ కింగ్ అద్భుతమైన అజేయమైన 85 పరుగులతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. దీంతో భారత్ టీ20 సిరీస్‌ను 3-2 తో కైవసం చేసుకుంది.
ఇక, ధనశ్రీ వర్మ చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. ఏంటి పాప నీవు ఎక్కడ ఉంటే.. అక్కడ సర్వనాశనం అంటూ సెటైర్లు వేస్తున్నారు. నీవు ఎవరి జీవితంలోకి వెళ్తే.. వారు అదోగతి అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, వెస్టిండీస్-టీమిండియా మధ్య ఆదివారం ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ నిర్థేశించిన టార్గెట్ ను విండీస్ టీమ్ అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్- బ్రాండన్ కింగ్ ఇద్దరు కలిసి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈజీగా వెస్టిండీస్ గెలిచింది.