
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ టీమ్ టెస్ట్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మింట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన విజ్ఞప్తి మేరకు బెన్ స్టోక్స్ వన్డేల్లో ఆడేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని నేడు ( బుధవారం ) అధికారికంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Read Also: Dareen Kent Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. చిన్నవయసులోనే నటుడి మృతి
అయితే, ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లీష్ టీమ్ సెలక్టర్లు స్టోక్స్ కు వన్డే టీమ్ లో స్థానం కల్పించారు. తర్వలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ కోసం బెన్ స్టోక్స్ ను వన్డే టీమ్ కు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ సెలెక్టర్లు న్యూజిలాండ్ సిరీస్ కోసం టీ20, వన్డే జట్లను ఇవాళే ( బుధవారం ) ప్రకటించింది. 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే కివీస్ టీమ్ తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు ), ఆతర్వాత వన్డే సిరీస్ ను ఆడనుంది. ఈ టూర్ లో ఫస్ట్ టీ20 ఆగస్ట్ 30న, సెకండ్ ది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న సెకండ్ వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనుంది.
Read Also: Kota: కోటాలో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య
ఇంగ్లండ్ టీ20 జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్.
ఇంగ్లండ్ వన్డే జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.