Leading News Portal in Telugu

IND vs IRE Dream11 Prediction: భారత్ vs ఐర్లాండ్‌ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్ఎం వైస్ కెప్టెన్ టిప్స్!


IND vs IRE 1st T20I Dream11 Prediction India Tour of Ireland: భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య ‘ది విలేజ్‌’ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సీనియర్ల గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో 2-3 ప్లేయర్స్ భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్లతో బరిలోకి దిగుతున్న ఐర్లాండ్.. టీమిండియాను ఓడించాలని చూస్తోంది.

రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లకు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. వెస్టిండీస్‌పై చెలరేగిన తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడతాడు. సంజు శాంసన్‌కు టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వనుంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ అరంగేట్రం పక్కా కాగా.. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ చాలా రోజుల తర్వాత ఆడనున్నారు. గాయం కారణంగా 11 నెలలు ఆటకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. నేడు బరిలోకి దిగనున్నాడు. పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు.

తుది జట్లు (అంచనా):
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.

డ్రీమ్11 టీమ్:
కీపర్ – సంజు శాంసన్
బ్యాటర్స్- పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ
ఆల్‌రౌండర్‌లు – వాషింగ్టన్ సుందర్, కర్టిస్ కాంఫర్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు – జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మార్క్ అడైర్