CSK becomes 1st IPL team to have 10M followers on X: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్(ట్విటర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్‌కే ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎక్స్‌లో10 మిలియన్ ఫాలోవర్స్ ఫీట్ సాధించిన ఐపీఎల్ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్ర స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 8.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్ధానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 6.8.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 5.2.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 3.2 మిలయన్ల ఫాలోవర్లతో టాప్-5లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ (2.9), రాజస్తాన్ రాయల్స్ (2.7), ఢిల్లీ క్యాపిటల్స్ (2.5), లక్నో సూపర్ జెయింట్స్ (760.4), గుజరాత్ టైటాన్స్ (552.7) ఫాలోవర్లను కలిగి ఉన్నాయి.
ఐపీఎల్ 2023 విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తంగా చెన్నై ఖాతాలో ఐదు ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఐదు టైటిల్స్ కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే వచ్చాయి. ఐపీఎల్ 2023 విజయంతో అత్యధిక టైటిల్స్‌ను గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డను చెన్నై సమం చేసింది. చెన్నై సారథి ధోనీకి ప్రప్రాంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. చెన్నైకి కొండంత అండ మహీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Thanks a 1️⃣0️⃣ for the X-treme Yellove and whistles from all around the world 🫶🏼🥳 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/XaA8FgdhYU
— Chennai Super Kings (@ChennaiIPL) August 17, 2023