When and How to watch Asia Cup 2023 Live Streaming in India: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరుగుతుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లకు పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్నాయి.
ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను టీవీ, మొబైల్‌లో ఎక్కడ చూడాలని క్రికెట్ ఫాన్స్ వెతుకుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో ఆసియా కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ చూడొచ్చు. ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌కు సంబందించిన ఓ వీడియోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రీలీజ్ చేసింది. భారత్‌లో మొబైల్ దారులందరికి తమ ఫ్లాట్‌ఫామ్‌ను మరింత చేరువ చేయడమే హాట్‌స్టార్ లక్ష్యం, ఎక్కడిగా వెళ్లినా క్రికెట్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడొచ్చు అని హాట్‌స్టార్ పేర్కొంది.
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు ఉండగా.. పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. క్యాండీ, కొలంబో, ముల్తాన్, లాహోర్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి పాక్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. పాక్‌కు రామని భారత్ తెగేసి చెప్పడంతో శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహిస్తోంది పీసీబీ.