Leading News Portal in Telugu

World Cup 2023: ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ప్రత్యర్థులు ఎవరంటే?


ICC ODI World Cup 2023 Warm-Up Matches Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఘనంగా ఆరంభం కానున్న ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది.

వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌ల షెద్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు మెగా టోర్నీ వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా టోర్నీలో పాల్గొనే 10 జట్లు రెండేసి చొప్పున ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడనున్నాయి. హైదరాబాద్, గువాహతి, తిరువనంతపురం వేదికల్లో ఈ వార్మప్ మ్యాచులు జరుగుతాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరగనున్న ఈ వార్మప్ మ్యాచులకు వన్డే హోదా మాత్రం ఉండదు.

ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడుతుంది. సెప్టెంబర్‌ 30న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో గువాహతిలో భారత్‌ తలపడనుంది. ఇక అక్టోబర్‌ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొననుంది. ఇక హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్‌ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మ్యాచ్ ఉండగా.. అక్టోబర్‌ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య మ్యాచ్ ఉంది.

వార్మప్ షెడ్యూల్:
సెప్టెంబర్ 29:
బంగ్లాదేశ్ vs శ్రీలంక – గువాహతి
దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ – తిరువనంతపురం
న్యూజిల్యాండ్ vs పాకిస్తాన్ – హైదరాబాద్

సెప్టెంబర్ 30:
భారత్ vs ఇంగ్లండ్ గువాహతి
ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – తిరువనంతపురం

అక్టోబర్ 2:
ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ – గువాహతి
న్యూజిల్యాండ్ vs దక్షిణాఫ్రికా – తిరువనంతపురం

అక్టోబర్ 3:
ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక – గువాహతి
భారత్ vs నెదర్లాండ్స్ – తిరువనంతపురం
పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా – హైదరాబాద్