Leading News Portal in Telugu

Sourav Ganguly: ప్రపంచకప్కు వీళ్లు ఆడితేనే బాగుంటుంది.. దాదా సెలక్ట్ చేసిన టీమ్ ఇదే..!


వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఈనెల 30 నుంచి ఆసియా కప్ కూడా ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియాకు మంచి ప్లస్ పాయింట్ కానుంది. అయితే అక్టోబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం.. మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు తన ఫేవరెట్ టీమిండియా జట్టును ప్రకటించారు.

Reliance Yousta Store: హైదరాబాద్‌లో ‘యూస్టా’ స్టోర్.. ఏది కొన్నా ధర తక్కుమే!

రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లకు బ్యాట్స్ మెన్లుగా చోటు కల్పించారు గంగూలీ. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇవ్వగా.. కేఎల్ రాహుల్ ఆప్షనల్ కీపర్ గా ఉంటాడని తెలిపారు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్ లకు చోటు కల్పించారు. కుల్దీప్ యాదవ్ ను స్పిన్ ఆప్షన్ గా తీసుకున్నారు. అటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లకు చోటు కల్పించారు.

Daggubati Purandeswari : టీటీడీ పవిత్రతను మసకబరిచేలా ఉన్న నియామకాలను బీజేపీ ఖండిస్తుంది

మరోవైపు ఆసియా కప్ కు సెలక్ట్ అయిన తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ లకు గంగూలీ తన జట్టులో స్థానం కల్పించలేదు. గాయాల నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కు స్థానం కల్పించారు. ఇదిలా ఉంటే.. జట్టులో ఎవరైనా ఏ సమస్యతోనైనా వైదొలగితే వారి స్థానంలో వచ్చేందుకు ముగ్గురిని బ్యాక్ అప్ ప్లేయర్లుగా గంగూలీ సూచించారు. తిలక్ వర్మ (బ్యాట్స్ మెన్), ప్రసిద్ధ్ కృష్ణ (ఫాస్ట్ బౌలర్), యజువేంద్ర చాహల్ (స్పిన్నర్)లను బ్యాక్ అప్ ప్లేయర్లు అని చెప్పారు.

Naseem Shah: నాకు హార్ట్ ఎటాక్ రాదని ఆశిస్తున్నా: పాక్‌ పేసర్‌

సౌరవ్ గంగూలీ ప్రపంచకప్ టీమ్:
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.