అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్-1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేయడంతో.. మళ్లీ నెంబర్-1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. కాగా, 118 రేటింగ్‌తో పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు సమనంగా ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడం వల్ల అగ్రపీఠాన్ని పాక్ సొంతం చేసుకుంది.
ఇక, భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలోకి దిగజారిపోయింది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా టీమ్స్ కంటే ఐదు పాయింట్లు టీమిండియా వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ జట్టు 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.
అయితే, కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ను పాకిస్థాన్ టీమ్ ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 రన్స్ చేసింది. మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ అర్ధ సెంచరీలతో కదం తొక్కగా.. ఆగా సల్మాన్, నవాజ్ రాణించడంతో ఆఫ్ఘాన్ పై పాక్ సునాయసంగా విజయం సాధించింది.
నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలా రెండు వికెట్లు సాధించారు.