Leading News Portal in Telugu

Asia Cup 2023: షాకింగ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి శ్రేయాస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్ ఔట్!


KL Rahul, Shreyas Iyer Unlikely To Get Picked For Asia Cup 2023: ఆసియా కప్‌ 2023లో పోటీ పడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. మరికొద్దిసేపట్లో అజిత్ అగార్కర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న సెలక్షన్‌ కమిటీ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొననున్నాడు. 17 మంది ఆటగాళ్లను ఆసియా కప్‌కు ఎంపిక చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ జట్టులో గాయాల నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉంటారో? లేదో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం… కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు ఆసియా కప్‌ 2023కి దూరమయ్యే అవకాశం ఉందట. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ ఇద్దరినీ నేరుగా బరిలోకి దించడానికి ఇష్టపడడం లేదట. ముందుగా వారి ఫిట్‌నెస్ నివేదికలను అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుందట. ప్రపంచకప్ 2023 కోసం పూర్తిగా ఫిట్‌గా లేని వీరిని ఆసియా కప్‌లో ఆడించి రిస్క్ తీసుకోవాలని బీసీసీఐ భావించడం లేదట. ఫిట్‌నెస్ నివేదికల ఆధారంగానే ఈ ఇద్దరి ఎంపిక ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్ రిపోర్టులను ఎన్‌సీఏలో మెడికల్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్.. బీసీసీఐ సెలక్షన్ కమిటీకి నేడు అందజేయనున్నారు. ఈ రిపోర్టులు సరిగా ఉంటేనే.. ఈ ఇద్దరు ఆసియా కప్‌ 2023కి ఎంపికవవుతారట. ఈ సంవత్సరం ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న వీరిని హడావిడిగా రంగంలోకి దించే ప్రయత్నం చేయకూడని బీసీసీఐ అనుకుంటోందట. ఇదే నిజం అయితే ఆసియా కప్ నుంచి అయ్యర్‌, రాహుల్ ఔట్ అవుతారు. ఒకవేళ స్టార్ బ్యాటర్స్ ఎంపిక కాకుంటే.. ఈ ఇద్దరి స్థానాల్లో ఎవరికి అవకాశం ఉంటుందో వేచి చూడాలి.