భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ కు పండగే. అంతేకాకుండా వారి మధ్య మ్యాచ్ అంటే హైఓల్టేజ్ ఉంటుంది. అయితే ఈ జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న దానిలో సందేహం లేదు. అయితే భారత్-పాక్ మధ్య హై వోల్టేజ్ తాజా మ్యాచ్ శ్రీలంక లోని పల్లకెలే జరుగనుంది. ఆసియా కప్-2023 లో భాగంగా.. సెప్టెంబర్ 2న భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాయి.
AAM Admi Party: ఇండియా కూటమికి షాక్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్
మరోవైపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే కింగ్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో దూకుడుగా ఆడి తన ప్రదర్శన ఏంటో చూపించాడు. పాక్ బౌలర్లకు చుక్కులు చూపించి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు. ఇప్పటికే ఆసియా కప్ కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తుండగా.. రన్ మిషీన్ నెట్స్ లో బీభత్సంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలింది.
Buchhibabu Sana: బుచ్చిబాబు.. చరణ్ సినిమాతో నీ దశ తిరిగిందయ్యా..
అయితే ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ను అడిగారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు అన్నారా లేదా అన్నది పక్కన పెడితే.. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ అందరికి ఆటతోనే సమాధానం ఇస్తామని చెప్పాడు. అంతేకాకుండా.. మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టులో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.