ఆసియా కప్ 2023 ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత సరైన మ్యాచులు లేక, చప్పగా సాగుతున్న మ్యాచ్ లను చూడలేక క్రికెట్ ఫ్యాన్స్ బోర్ ఫీలైయ్యారు. ఇక రేపటి ( బుధవారం ) నుంచి ఆసియా కప్ నుంచి మళ్లీ క్రికెట్ మజాని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు.
జియో దెబ్బకు ఐపీఎల్ మొబైల్ ప్రసార హక్కులు కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. గత కొన్ని నెలల వ్యవధిలోనే కోట్ల మంది సబ్‌స్కైబర్లను కోల్పోయింది. మార్చి 2023 నుంచి 6 నెలల్లో దాదాపు 2 కోట్ల మంది తమ మొబైల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక లాభం లేదని.. హాట్ స్టార్, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియా కప్ లైవ్ మ్యాచ్ లను చూడాలంటే మొబైల్ నెంబర్‌తో లాగిన్ కావ్వాల్సి ఉంటుంది.
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెళ్లలో ఆసియా కప్ మ్యాచ్ లు ప్రత్యేక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.. కన్నడ, తమిళ్ భాషల్లోనూ లైవ్ కామెంటరీని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అందిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నీలో మ్యాచులన్నీ డే-నైట్ గేమ్స్‌గానే జరుగనున్నాయి. ఇండియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.. టాస్ మధ్యహ్నం 2.30 గంటలకు పడుతుంది.
రేపు (ఆగస్టు 30న) ముల్తాన్‌లో పాకిస్తాన్ – నేపాల్ మధ్య తొలిపోరుతో ఆసియా కప్ 2023 ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 31న శ్రీలంకలోని పల్లెకెలెలో బంగ్లాదేశ్ – శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 1న మ్యాచులేమీ లేవు.. సెప్టెంబర్ 2న ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్ – ఆఫ్ఘాన్ మధ్య లాహోర్‌లో, సెప్టెంబర్ 4న టీమిండియా – నేపాల్ మధ్య పల్లెకెలెలో మ్యాచులు జరుగనున్నాయి. సూపర్ 4 రౌండ్‌లో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.