Leading News Portal in Telugu

Asia Cup 2023: హావ్వా…. ఫ్యాన్స్ లేక వెలవెలబోయిన పాక్ స్టేడియం


ఇవాళ( ఆగస్ట్ 30 ) ఆసియా కప్‌ 2023లో భాగంగా ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో పాకిస్థాన్ పోటీ పడుతుంది. అయితే, దాదాపు పదిహేనేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

దాయాది పాకిస్తాన్‌ దేశంలో బాంబుల మోత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చివరికి చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్లు, ప్రార్థనా మందిరాలను కూడా అక్కడి టెర్రరిస్టులు వదిలి పెట్టరు. ఈ క్రమంలో పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్ జరుగుతోన్న ముల్తాన్ స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో పలు ఊహాగానాలకు కారణమవుతోంది. బాంబుల భయంతో ప్రేక్షకులు ముల్తాన్ స్టేడియానికి రాలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ స్టేడియం సామర్థ్యం 30వేలు కాగా, కేవలం 13వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియంలోని అన్ని స్టాండ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

ఇక, కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ (131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు ) భారీ శ‌త‌కంతో విరుచుకుప‌డ‌డంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 342 ప‌రుగులు చేసింది. దీంతో నేపాల్ ముందు 343 ప‌రుగుల లక్ష్యం ఉంది. బాబ‌ర్ తో పాటు ఇప్తికార్ అహ్మద్ ( 71 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లతో 109 నాటౌట్ ) కూడా దంచి కొట్టడంతో పాక్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో మహ్మద్ రిజ్వాన్(44) రాణించాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి రెండు వికెట్లు తీయ‌గా కరణ్ కెసి, సందీప్ లామిచానేలు తలో వికెట్ తీసుకున్నారు.