Bangladesh opt to bat vs Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోరును నమోదు చేయాలనుకుంటున్నామని షకీబ్ తెలిపాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని అఫ్గానిస్తాన్ సారథి హష్మతుల్లా షాహిదీ చెప్పాడు.
గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. దాంతో తొలి మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో శ్రీలంక చేతిలో బోల్తాపడిన షకీబుల్ బృందం.. అఫ్గాన్‌తో జరిగే పోరులో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిపాలైతే టోర్నీ నుంచే నిష్కమ్రించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్ధినైనా కంగుతినిపించగలదు. తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో అఫ్గాన్ బరిలోకి దిగనుంది.
తుది జట్లు:
అఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బాదిన్ నయీబ్, ఉర్మాన్ ఖానేబ్, రహమాన్ ఖానేబ్, ఫజల్హక్ ఫరూఖీ.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, ముష్ఫికర్ రహీమ్ (కీపర్), షమీమ్ హొస్సేన్ పట్వారీ, అఫీఫ్ హొస్కిన్, హాసన్, మహమూద్, షోరిఫుల్ ఇస్లాం.