Leading News Portal in Telugu

Virat Kohli: పాకిస్తాన్‌లో విరాట్‌కి క్రేజ్‌ మాములుగా లేదు.. ఇసుకలో ‘కింగ్’ కోహ్లీ!


Pakistan Fan Creates Live Sized Sand Art For Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. దాయాది కోహ్లీ పాకిస్తాన్‌లో కూడా ‘కింగ్’ కోహ్లీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. బలూచిస్థాన్‌కు చెందిన కొంతమంది ఫ్యాన్స్‌.. కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ అభిమాని గ్వాదర్ బీచ్‌లో విరాట్‌ కోహ్లీ చిత్రాన్ని గీశాడు. ఇసుకలో కోహ్లీ చిత్రాన్ని అద్భుతంగా గీశాడు. గ్వాదర్ సిటీలోని సచన్ బలోచ్ అనే కళాకారుడు భారత మాజీ కెప్టెన్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా కోహ్లీ చిత్రాన్ని ఇసుకతో రూపొందించాడు. అనంతరం ఆ చిత్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది కూడా ఇతను ఇసుకలో కోహ్లీ చిత్రాన్ని గీశారు.

ఆసియా కప్‌ 2023లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసి షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ పాక్ అమ్మాయి అయితే తాను కోహ్లీ కోసమే మ్యాచ్ చూసేందుకు వచ్చానని, త్వరగా ఔట్ అయి తన మనసును హార్ట్ చేశాడని తెలిపింది. మిగతా మ్యాచ్‌ల్లో కోహ్లీ భారీ స్కోర్లు చేయాలని ఫాన్స్ ఆశిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 4న నేపాల్‌తో
భారత్ తలపడనుంది.