Leading News Portal in Telugu

Muthaiah Muralitharan: మరో క్రికెటర్ బయోపిక్.. రేపు ట్రైలర్ విడుదల చేయనున్న సచిన్


Muthaiah Muralitharan: శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఎంతవరకు ఇతనికన్న ఎక్కువ వికెట్లు సాధించిన వారులేరు. అయితే తన జీవిత చరిత్ర ఆధారంగా ‘800’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 5న ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారు.

ఈ సినిమాలో మురళీధరన్ పాత్రను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ పోషిస్తున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంఛ్ కు సచిన్ టెండూల్కర్ హాజరుకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కృష్ణ ప్రసాద్ ‘ఆదిత్య 369’తో మంచి హిట్‌ సాధించారు.