Leading News Portal in Telugu

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బద్దలు!


Rohit Sharma Becomes 1st Batter to Score 50 Plus Scores in Asia Cup: ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

ఆసియా కప్‌ టోర్నీలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్‌లు చేసిన భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ ఇప్పటివరకు ఆసియా కప్‌లో 10 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉండేది. ఆసియా కప్‌ టోర్నీలో సచిన్ 9 హాఫ్ సెంచరీలు బాదాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ 5 సిక్స్‌లు బాదడంతో.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా 250వ సిక్స్‌ మైలురాయిని అందుకున్నాడు. దాంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో రోహిత్ 280 సిక్స్‌లు బాదాడు. వన్డే క్రికెట్‌లో షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 331 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనాగుతున్నాడు. ఈ జాబితాలో మూడో స్ధానంలో హిట్‌మ్యాన్ నిలిచాడు. ఆసియా కప్‌ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ఆటగాడిగా కూడా నిలిచాడు.