Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్, నేపాల్ మ్యాచ్ సందర్భంగా మైదానం నుంచి వెళ్లిపోతున్న గౌతమ్ గంభీర్‌ను చూసి.. ఫాన్స్ కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు. ఇది చూసిన గౌతీ.. అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపించడం వీడియోలో కన్పించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది. గంభీర్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఎంపీ అయిన గంభీర్ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. దీనిపై తాజాగా గౌతీ స్పందిస్తూ.. కోహ్లీ కోహ్లీ అని అరిచినందుకు తాను మిడిల్ ఫింగర్ చూపించలేదని, భారత్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగానే రియాక్ట్ అయ్యానని తెలిపారు.
‘ఒక అబద్ధం ప్రపంచంలో సగం వరకు వేగంగా వ్యాపించగలదు. నిజం అలా కాదు. సోషల్ మీడియలో మీరు చూస్తున్నది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ప్రజలు ఏమి చూపించాలనుకుంటున్నారో అదే చూపిస్తారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. ఏ భారతీయుడైనా ప్రతిస్పందిస్తాడు. నేను నా దేశాన్ని, మన ఆటగాళ్లను ప్రేమిస్తున్నాను. అక్కడ 2-3 పాకిస్తానీలు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను వినలేను. విని నవ్వుతూ వెళ్లిపోలేను. అందుకే వారికి మిడిల్ ఫింగర్ చూపించా’ అని గౌతమ్ గంభీర్ తెలిపారు.
Presenting BJP MP Gautam Gambhir 👇 pic.twitter.com/Unv5cwBYqW
— Srinivas BV (@srinivasiyc) September 4, 2023