Asia Cup 2023: ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యా్చ్ లో 7 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్(78), రిజ్వాన్(63) అర్థసెంచరీలతో చెలరేగారు. ఇక బంగ్లా బౌలర్లలో తస్కిన్, షోరిఫుల్, మెహిదీ హాసన్ తలో వికెట్ తీశారు. మరోవైపు పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.
ఇక మరోవైపు సూపర్-4 మ్యాచ్ లో ఈనెల 10న భారత్-పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా.. సూపర్-4లో మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈసారి జరిగే మ్యాచ్ కు వరణగండం ఏమీ లేదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక్క మ్యాచ్ రద్దు కాగా.. ఈ మ్యాచ్ కు కూడా వర్షసూచన ఉందేమోనని ఖంగారులో ఉన్నారు. అయితే సెప్టెంబర్ 10న వర్షం పడే అవకాశాలు తక్కువనే అని గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో క్రికెట్ అభిమానులు మళ్లీ దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెల 9న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది.