Leading News Portal in Telugu

Mitchell Starc: మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత..!


Mitchell Starc Set To Play IPL in 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నాడు. భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో మరలా ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో తాను పాల్గొంటానని స్టార్క్ స్వయంగా ప్రకటించాడు. దాంతో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్నాడు. స్టార్ చివరిసారిగా 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడాడు.

2014, 2015 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మిచెల్ స్టార్క్ ఆడాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2016 సీజన్ ఆడలేదు. 2017లో ఐపీఎల్ ఆడకూడదని స్టార్క్ నిర్ణయం తీసుకున్నాడు. 2018లో వేలంలోకి రాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను ఆ సీజన్ ఆడలేదు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీతో అతడికి కేసు నడిచింది. ఆ కేసు 2020లో ముగిసింది.

2019లో వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉన్నారు. అందులో మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. ఆపై టీ20 ప్రపంచకప్స్, యాషెస్, ద్వైపాక్షిక సిరీస్లతో స్టార్క్ చాలా బిజీగా గడిపాడు. మరోవైపు అతడి భార్య, ఆసీస్ మహిళా క్రికెటర్ అలీసా హేలీ కూడా చాలా బిజీగా గడిపింది. ఇన్ని ఏళ్లు ఆస్ట్రేలియా జట్టు, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన స్టార్క్.. ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. 2024 జూన్‌లో వెస్టిండీస్ మరియుఅమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దానికి సన్నాహకంగా ఐపీఎల్ 2024ను వాడుకోవాలని స్టార్క్ చూస్తున్నాడు.