హైదరాబాద్ వేదికగా తొలిసారి డబ్య్లూడబ్య్లూఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 17 ఏళ్ల తర్వాత ఇండియాకి జాన్ సిన రానున్నారు.
WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు. రేపు గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ కొనసాగనుంది. ఈ ఈవెంట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా డబ్య్లూడబ్య్లూఈ లెజెండ్ జాన్ సినా పాల్గొనబోతున్నారు.
అయితే, జాన్ సిన 17 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెడుతున్నాడు. దీంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన సూపర్ ఫైట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నెల రోజుల ముందే ఈ టికెట్లు సోల్డ్ ఔట్ అని బోర్డు కనిపించింది. 500 రూపాయల నుంచి 17 వేల రూపాయల వరకు టికెట్లు అమ్మకాలు చేశారు. ఒక్క టికెట్ కూడా అందుబాటులో లేదని.. అన్నీ అమ్ముడుపోయాయి అని బుక్ మై షో తెలిపింది.
ఇప్పటికే హైదరాబాద్ కు వరల్డ్ ఫేమస్ రెజ్లర్లు చేరుకున్నారు. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. విమెన్ ఛాంపియన్ రియా రిప్లే, WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ తో పాటు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి డబ్య్లూడబ్య్లూఈ స్టార్‌లు వచ్చారు. ఈ సూపర్ ఫైట్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఫైట్ తో పాటు జాన్ సినను చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు.