Leading News Portal in Telugu

Asia Cup 2023: శ్రీలంకపై విజయం.. ఫైనల్‌లో భారత్..


Asia Cup 2023: ఆసియా కప్‌లో తన జోరును కొనసాగిస్తోంది టీమిండియా.. నిన్న పాకిస్థాన్‌పై చిరస్మరనీయ విక్టరీ కొట్టి సత్తా చాటిన భారత్.. ఈ రోజు శ్రీలంక బౌలర్ల దాటికి తక్కువ స్కోర్‌ చేసినా.. విజయాన్ని అందుకుంది.. లంకపై 41 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 213 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.. ఇక, 214 పరుగుల టార్గెట్‌ చేధనలో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచి కష్టాల్లో పడింది.. అయితే, యువ ఆటగాడు దునీత్ వెల్లలాగే బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేయడమే కాదు.. బ్యాట్‌కు కూడా పనిచేసి శ్రీలంక విజయంపై ఆశలు రేపాడు.. కానీ, ఇతర బ్యాట్స్‌మన్స్‌ నుంచి సరైన సహకారం అందలేదు.. దీంతో.. 172 పరుగులకే శ్రీలంక పెవిలియన్‌ చేరింది.. దీంతో.. 41 పరుగుల తేడాతో భారత్‌ విక్టరీ కొట్టింది.. భారత బౌలర్లలో 4 వికెట్లు తీసి కుల్దీప్‌ సత్తా చాటగా.. జడేజా, బూమ్రా చెరో రెండు వికట్లు, సిరాజ్, హార్దిక్ పాండ్య తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు..

బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో లంక యువ స్పిన్నర్ దునీత్ వెల్లలాగే రాణించాడు.. బ్యాటింగ్ లో దునీత్ 42 పరుగులతో ఆకట్టుకోగా.. బౌలింగ్ లో భారత ఆటగాళ్ల 5 కీలక వికెట్లు తీశాడు.. దీంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చివరికి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో వర్షం అంతరాయం కలిగించినా, కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో భారత్ వికెట్లు తీయడంలో కీలక భూమిక పోషించాడు. మరో స్పిన్నర్ చరిత్ అసలంక 4 వికెట్లతో భారత లోయరార్డర్ పనిబట్టాడు. మిస్టరీ స్పిన్నర్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. ఇక, భారత్‌ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ 33, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు సాధించాడు. మిగతావారు చెప్పుకోదగిన స్థాయిలో స్కోర్లు చేయలేకపోయారు.

4 పాయింట్లతో సూపర్ ఫోర్ టేబుల్‌లో టాప్‌ స్పాట్‌లో నిలిచింది టీమిండియా.. రెండో స్థానంలో శ్రీలంక ఉండగా.. మూడో స్థానంలో పాకిస్థాన్‌ నిలిచింది.. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికి పరిమితమైంది బంగ్లాదేశ్‌.. మరోవైపు.. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు.. వన్డేల్లో 150 వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ నిలిచాడు.. 88 వన్డేల్లో 150 వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ కొత్త రికార్డు నెలకొల్పాడు.