Leading News Portal in Telugu

Asia cup 2023: “ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసింది”.. షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై


Asia cup 2023: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్‌తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లోస్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 213 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా, శ్రీలంకను కేవలం 172 పరుగులకే కుప్పకూల్చింది. కుల్దీప్ యాదవ్, జస్పీత్ బూమ్రా, జడేజా, సిరాజ్ బౌలింగ్ లో సత్తా చాటారు. మన పేస్, స్పిన్ బౌలింగ్ ఆడేందుకు శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు.

ఇదిలా ఉంటే భారత్ 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా ఈ మ్యాచును ఫిక్స్ చేసిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపడానికి కావాలనే భారత్ ఓడిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కి కొంత మంది అభిమానులు ఫోన్లు చేశారు. నిన్న ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత్ 213కి ఆలౌట్ కావడంతో శ్రీలంక గెలుస్తుందని అంతా భావించారు. మొదటి ఇన్నింగ్స్ పూర్తి కాగానే పాక్ అభిమానులు ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.

‘‘మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. పాకిస్తాన్ ఫైనల్ చేరకుండా అడ్డుకునేందుకు భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోతుందని నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. మీరు బాగానే ఉన్నారా..?’’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. వెల్లలాగే, అసలంక హార్ట్ పుల్ గా బౌలింగ్ చేయడం చూడవచ్చు. 20 ఏళ్ల పిల్లవాడు వెల్లలాగే 5 వికెట్లు తీశాడని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొన్నాడు. మ్యాచులో శ్రీలంక చూపిన పోరాటాన్ని కొనియాడారు. విజయం సాధిస్తే తప్పకుండా ఫైనల్ చేరుతామని భారత్ కు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుందని ప్రశ్నించాడు.

4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించిన కుల్దీప్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. అంతకుముందు పాక్ తో జరిగిన మ్యాచులో కుల్దీప్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. బూమ్రా, కుల్దీప్ చూడండి.. చిన్న టోటల్ ని ఎలా కాపాడుకున్నారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జట్టు సరిగా పోరాటం చేయలేదని, పేసర్లు హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాహీద్ అఫ్రిది ఫిట్‌నెస్ గురించి ప్రశ్నించారు. వెల్లాగే అనే 20 ఏళ్ల పిల్లవాడు ఫైట్ చూపిస్తున్నాడు. అతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేస్తున్నాడు, అతను చేయగలిగినదంతా చేస్తున్నాడు. మా ఆటగాళ్లు (పాకిస్తాన్) ఈ పోరాటాన్ని చూపించలేకపోయారని ఆరోపించాడు. ప్రస్తుత ఇండియా ఫైనల్ కి చేరుకుంది. పాక్ ఫైనల్ చేరాలంటే తరువాత జరిగే మ్యాచులో శ్రీలంక, పాకిస్తాన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.