Leading News Portal in Telugu

JioCinema: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా భారత్-ఆస్ట్రేలియా సిరీస్! బరిలోకి రైనా, విహారి



Jiocinema

JioCinema to Stream IND vs AUS ODI Series Free: క్రికెట్ అభిమానులకు ‘జియోసినిమా’ గుడ్‌న్యూస్ అందించింది. ఆసియా కప్ 2023 తర్వాత జరిగే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను ‘వయాకామ్18’ సొంతం చేసుకుంది. జియోసినిమా ఈ కంపెనీకి చెందినదే. ఐపీఎల్ 2023ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడంతో జియోసినిమాకు సూపర్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్‌ను కాపాడుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది.

మొత్తం 11 భాషల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచులను జియోసినిమా అందించనుందట. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ, మరాఠీ భాషల్లో కామెంటరీ ఉంటుందట. ఇందుకోసం మంచి ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు జియోసినిమా ప్రయత్నిస్తోందట. తెలుగు ఆటగాడు హనుమ విహారి, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా సహా కేదార్ జాదవ్, అమిత్ మిశ్రా, ఆకాష్ చోప్రా, కిరణ్ మోరే, శరణ్‌దీప్ సింగ్ తదితరలు కామెంటరీ ప్యానెల్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది.

Also Read: PAK vs SL: భారత్‌తో మ్యాచ్‌ తర్వాత బాగా నిరుత్సాహ పడ్డాం: మోర్నే మోర్కెల్‌

భారత్ ఆడే అన్ని హోం మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. క్రేజ్ పెంచుకోవడానికి ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ అందిస్తోన్న జియోసినిమా.. భవిష్యత్తులో ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో ఆడే మూడు వన్డేల సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. తుది జట్టును తయారు చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. భారత గడ్డపై సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.