Leading News Portal in Telugu

Tilak Varma: వన్డేల్లోకి తెలుగు క్రికెటర్‌ అరంగేట్రం


టీమిండియా యంగ్ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తిలక్‌ వర్మకు క్యాప్‌ను అందించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లు ఆడి అదరగొట్టిన ఈ తెలుగు తేజం.. ఆసియా కప్‌ టీమ్‌లో స్థానం దక్కించుకున్నాడు. కానీ ఇప్పటి వరకు అతనికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్ రాలేదు.

భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయిపోవడంతో.. టీమ్ లోని కీలక ప్లేయర్లకు వరల్డ్‌ కప్‌కు ముందు రెస్ట్‌ ఇస్తుండటంతో తిలక్‌ వర్మకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఛాన్స్ దొరికింది. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో తిలక్‌కు అవకాశం రాకపోయినా.. వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియాకు తిలక్‌ వర్మ కీలక ప్లేయర్‌గా మారే ఛాన్స్ ఉంది. ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌, స్పిన్‌, పేస్‌ను అద్భుతంగా ఆడగల ఈ యంగ్ డైనమిక్ క్రికెటర్‌.. ముఖ్యంగా టీమ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్.. జట్టుకు నాలుగో స్థానంలో టీమిండియా తరపున బెస్ట్‌ ప్లేయర్‌ గా మారనున్నాడు.

తిలక్ వర్మ ఇప్పటికే టీ20లతో తనను తాను నిరూపించుకున్నాడు. ఈ వన్డేలోనూ రాణిస్తే.. టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌గా మారే ఛాన్స్ మెండుగా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగనున్న వన్డేలో తిలక్‌ వర్మ ఆడుతున్నాడు. ఇక, బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ మొదట ఫీల్డింగ్ చేయలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఐదు మార్పులతో ఇండియా బరిలోకి దిగింది. విరాట్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్ లకు రెస్ట్ ఇచ్చారు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి టీమ్ లోకి వచ్చారు.