Leading News Portal in Telugu

Pakistan: పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్


వన్డే ప్రపంచకప్-2023కు ముందు పాకిస్తాన్‌ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని టాక్. ఆసియా కప్‌-2023లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ లో ఫీల్డింగ్‌ చేస్తూ నసీం షా గాయపడి.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. దీంతో గాయం తీవ్రమైంది కావడంతో అతను శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ఆడలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నసీం.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం​ నెల రోజుల టైం పట్టవచ్చని చెప్పినట్లు తెలుస్తుంది.

ఇదే జరిగితే నసీం షా వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండలేడు. మరోవైపు నసీం షాతో పాటు మరో పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ లో గాయపడ్డాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగానే అఘా సల్మాన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడగా, శ్రీలంకతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఇక, పాకిస్థాన్ కీలక ఆటగాళ్లంతా వరుసపెట్టి గాయాల బారిన పడటంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓటమిపాలై, ఏకంగా టోర్నీ నుంచే వైదిలిగింది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్‌ 10న శ్రీలంకతో, అక్టోబర్‌ 14న టీమిండియాతో తలపడుతుంది.