Leading News Portal in Telugu

IND vs SL: ఫైనల్లో అతనితో జాగ్రత్త అంటున్న టీమిండియా ప్లేయర్లు


రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆటగాడిని ఫైనల్‌లో టీమిండియా ఎలా డీల్ చేయగలదు.. మరోసారి ఈ ఆటగాడు టీమిండియాకు టెన్షన్‌గా మారతాడా..?. ఇంతకు టీమిండియాను ఇబ్బంది పెట్టే ఆటగాడు ఎవరునుకుంటున్నారా దునిత్ వెలలేగే.

సెప్టెంబర్ 12న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక- భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. వెలలాగే ఓ మంచి ఇన్నింగ్స్ ఆడడం భారత ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారత్‌పై 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌లోని సీనియర్ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను ఔట్ చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ పై సెంచరీలు బాదిన కోహ్లీ, కేఎల్ రాహుల్ ను తన అద్భుత స్పిన్ మాయజాలంతో వెనక్కి పంపించాడు.

మరోవైపు రన్ మిషన్ విరాట్ కోహ్లి సాధారణంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లకు తడబడటం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనాప్పటికీ ఫైనల్‌లో భారత్‌కు విరాట్ కోహ్లీ అత్యంత ప్రాధాన్యం. ఇలాంటి పరిస్థితిలో కోహ్లీ తన వికెట్‌ను వెలలాగేకి ఇవ్వకూడదని అనుకుంటున్నాడు. గత మ్యాచ్ జ్ఞాపకాలు టీమ్ ఇండియా మదిలో తప్పకుండా మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెలలాగేను ఎదుర్కొనేందుకు టీమిండియా పూర్తి సన్నద్ధతతో వస్తుంది. చూడాలి మరీ రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో.