Leading News Portal in Telugu

Washington Sundar: వాషింగ్టన్ సుందర్పై విపరీతమైన ట్రోల్స్.. ఫీల్డర్గా టైటిల్ అందించాడు..!


రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ చిత్తుగా ఓడించింది. అయితే అంతకుముందు భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో వాషింగ్టన్ సుందర్ చోటు సంపాదించాడు. అయితే ఫైనల్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఏకంగా ఫైనల్ మ్యాచ్ లో ఆడాడు.

అయితే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై వాషింగ్టన్ సుందర్ 15.2 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ విధంగా వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సుందర్ ఫీల్డర్‌గా కేవలం 15.2 ఓవర్లు మాత్రమే మైదానంలో ఉన్నాడు. అయితే.. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు ఆసియా కప్ టైటిల్‌ను అందించాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా.. వాషింగ్టన్ సుందర్ పై సోషల్ మీడియా వినియోగదారులు మీమ్‌లను పోస్ట్ చేస్తూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుందర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వరద కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో కేవలం ఫీల్డర్ గా ఉండి ఆసియా కప్ టైటిల్ సాధించిపెట్టావని కామెంట్స్ చేస్తున్నారు.