Leading News Portal in Telugu

Golden Ticket: రజనీకాంత్ను వరించిన గోల్డెన్ టికెట్.. వరల్డ్ కప్ ప్రత్యేక అతిథుల జాబితాలో తలైవా


అక్టోబర్ 5 నుండి ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. అందుకోసం సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని దేశాల టీమ్ లు.. తమ జట్లను ప్రకటించాయి. దీంతో పాటు ఈ టోర్నీలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రత్యేక చొరవను ప్రారంభించింది. ఇండియాలోని గొప్ప స్టార్లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌లకు గోల్డెన్‌ టికెట్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చేరాడు. తలైవాకు బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ ఇచ్చారు.

బీసీసీఐ.. ‘X’ (Twitter) ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో రజనీకాంత్‌కి జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గౌరవనీయులైన బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చి సత్కరించారు’ అని ఫోటోతో పాటు క్యాప్షన్ రాసింది. ఈ దిగ్గజ నటుడు కోట్లాది హృదయాల గుండెచప్పుడులపై చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ గోల్డెన్ అవార్డును అందజేసింది. గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కూడా గోల్డెన్ టికెట్‌తో సత్కరించారు. బీసీసీఐ ఈ ప్రత్యేక టిక్కెట్‌ను మరింత మంది ప్రముఖులకు బహుమతిగా ఇవ్వవచ్చు. మరోవైపు మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గోల్డెన్ టిక్కెట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీకి గోల్డెన్ టికెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.