Leading News Portal in Telugu

Gautam Gambhir: అతడు బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు: గంభీర్‌


Gautam Gambhir Meets Shah Rukh Khan: బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌పై ఉన్న ప్రేమను టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ మరోసారి చాటుకున్నాడు. షారుఖ్‌ బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదని, హృదయాలు కొల్లగొట్టే రారాజు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)కు షారుఖ్‌ ఖాన్‌ సహ యజమాని అన్న విషయం తెలిసిందే. కేకేఆర్‌కు గంభీర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌కు గౌతీ ట్రోఫీ కూడా అందించాడు. కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో గంభీర్‌, షారుఖ్‌ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

గౌతమ్ గంభీర్‌ కేకేఆర్‌ను వీడినా షారుఖ్‌ ఖాన్‌తో అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా గంభీర్‌ షేర్‌ చేసిన ఫొటోనే ఇందుకు నిదర్శనం. ‘షారుఖ్‌ ఖాన్‌ కేవలం బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు కూడా. మేము కలిసిన ప్రతిసారీ నేను అంతులేని ప్రేమ మరియు గౌరవంతో తిరిగి వెళ్తాను. మీ నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలి. మీరు బెస్ట్‌’ అన్ని గంభీర్‌ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షారుఖ్‌ ఖాన్‌, గౌతమ్ గంభీర్‌ తాజాగా కలుసుకున్నారు. అనంతరం గంభీర్‌ తన ఎక్స్‌లో బాలీవుడ్‌ బాద్‌ షాపై ప్రేమ కురిపించాడు. గంభీర్‌ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా, ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు షారుఖ్‌ ప్రస్తుతం ‘జవాన్‌’ సినిమా సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను చేస్తోంది.