Leading News Portal in Telugu

IND vs AUS: టాస్‌ నెగ్గిన భారత్‌.. అయ్యర్‌, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్‌


India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం దక్కింది. అయితే తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మకు నిరాశే ఎదురైంది.

ఆస్ట్రేలియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతోంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్.. భారత గడ్డపై సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఆసియా కప్‌ 2023 గెలిచి జోరు మీదున్న భారత్.. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌ 2023కి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్‌ సన్నాహకంగా ఉపయోగపడనుంది.

తుది జట్లు:
భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్‌, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, ఆడమ్ జంపా.