Leading News Portal in Telugu

IND vs AUS 3rd ODI: మూడో వన్డేకు గిల్ దూరం.. రోహిత్ భాగస్వామి ఎవరో తెలుసా?



Rohit Gill Hands

Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్‌ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్ సహా మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ అందుబాటులోకి వచ్చారు. దాంతో ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా మారింది.

మరోవైపు మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఏకంగా 6 మార్పులతో బరిలోకి దిగింది. మొదటి రెండు వన్డేలు ఆడని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి జట్టులోకి రాగా.. రెండో వన్డే ఆడని మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కింది. రెండు వన్డేలు ఆడిన ఆర్ అశ్విన్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ ఆడుతున్నాడు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్యాలు జట్టుకు దూరమయ్యారు.

ప్రపంచకప్ 2023 ముందు యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, పేసర్‌ శార్ధల్‌ ఠాకూర్‌లకు టీమ్ మేనెజ్‌మెంట్‌ విశ్రాంతిని ఇచ్చింది. వీరిద్దరూ బీసీసీఐ ప్రాక్టీస్ క్యాంప్లో చేరనున్నారు. గిల్‌ మూడో వన్డేకు దూరం కావడంతో.. రోహిత్ శర్మకు జతగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దాంతో మూడులో శ్రేయస్ అయ్యర్, నాలుగులో కేఎల్ రాహుల్ ఆడనున్నారు. ఐపీఎల్ మ్యాచులలో కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ మ్యాచులలో కూడా విరాట్ ఓపెనర్‌గా ఆడాడు.

Also Read: Itel Power P55 5G Launch: చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. రూ. 9699కే ఐటెల్‌ పీ55 పవర్ ఫోన్!

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్‌.