Leading News Portal in Telugu

Hyderabad: ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్..


హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొనగా.. ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఐటీసీ కాకతీయ హోటల్ లో కివీస్ జట్టు ఉండగా.. ఇక పాకిస్థాన్ జట్టు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి పార్క్ హయత్ కు చేరుకుంది. తాజ్ కృష్ణలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్.. శంషాబాద్ నోవొటెల్ హోటల్ లో శ్రీలంక జట్టు ఉండనుంది.

అయితే, 28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా వార్మప్ మ్యాచ్ లకు భద్రత ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు హెచ్.సీ.ఏకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్ నిర్వహించేలా అధికారులు యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి తెలిపింది. ఇంత వరకు బీసీసీఐ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో హెచ్.సీ.ఏ బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తుంది. మరోవైపు పాక్ -కివీస్ వార్మప్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది.