ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ మొదటి నుంచి చాలా దూకుడుగా కనిపించింది. నిఖత్ తొలి రౌండ్‌లో కేవలం 53 సెకన్లలోనే విజయం సాధించింది. జోర్డాన్ ఆటగాడు నిఖత్ ఆట ముందు చేతులెత్తేశాడు. నిఖత్ కేవలం 127 సెకన్లలో మ్యాచ్‌ను ముగించి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.
Women Reservation Bill: చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం..
19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 32 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్, రోయింగ్ ఈవెంట్లలో ఇండియా ఎక్కువ విజయాలను సాధించింది. అంతేకాకుండా.. ఈసారి గుర్రపు స్వారీలో కూడా దేశానికి పతకం వచ్చింది. సెప్టెంబర్ 29న టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం రజత పతకం రూపంలో వచ్చింది. భారత పురుషుల డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Rainbow Hospital: గుండె లోపాలను జయించిన చిన్నారులతో వరల్డ్ హార్ట్ డే
ఇక షూటింగ్‌లో.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ బంగారు, రజత పతకాలను గెలుచుకుంది. ఇందులో ఇషా పాలక్ 242.1 స్కోరుతో స్వర్ణం సాధించగా.. ఇషా సింగ్ 239.7 స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుని పతకం సాధించింది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాడ్మింటన్ జట్టు ఏకపక్షంగా 3-0తో విజయం సాధించింది. 1986 ఆసియా క్రీడల తర్వాత భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో పతకం సాధించడం ఇదే తొలిసారి.