Leading News Portal in Telugu

Rohit Sharma: వరల్డ్ కప్లో టీమిండియాను రోహిత్ శర్మ పక్కా గెలిపిస్తాడు..!


Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది. తొలిసారిగా రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లో నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్‌గా మంచి ప్రదర్శన కనిపించాడు. అంతేకాకుండా హిట్‌మ్యాన్‌గా పేరుపొందాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 6 సెంచరీలు సాధించాడు. అయితే ఇప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తుండటంతో.. రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడోనని ఆసక్తి నెలకొంది. వరల్డ్ కప్ రికార్డులు చూసుకుంటే.. ఈసారి వరల్డ్ కప్ రోహిత్ సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ రికార్డులు చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌ల్లో 65.20 సగటుతో 987 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్‌పై 140 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు రోహిత్ శర్మ. మంచి యావరేజ్‌తో పాటు స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. అతను 95.97 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

మరోవైపు క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును ఈ ప్రపంచకప్‌లో అధిగమించే అవకాశాలున్నాయి. సచిన్ కూడా ప్రపంచ కప్ లో 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ తన కెరీర్‌లో 251 వన్డేలు ఆడడం గమనార్హం. ఈ మ్యాచ్‌లలో 243 ఇన్నింగ్స్‌లలో అతను 48.85 సగటుతో 10,112 పరుగులు చేశాడు. అంతేకాకుండా 30 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు చేశాడు.