ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్‌ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్‌లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు. అందులో నేపాల్‌పై నాలుగు వికెట్లు తీశాడు. ఈరోజు హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విరామం తనకు కోలుకోవడానికి సహాయపడిందని తెలిపాడు. ప్రపంచ కప్ 2023లో తన ప్రదర్శనపై ఆశాజనకంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
IndiGo Plane Incident: గాలిలో విమానం.. చావుబతుకుల మధ్య పసికందు.. ఏం జరిగిందంటే..
మరోవైపు పాకిస్తాన్ తోటి ఆటగాడు ఫఖర్ జమాన్ గురించి మాట్లాడుతూ.. అతని ఆట తీరుపై విశ్వాసం వ్యక్తం చేశాడు. అతను ప్రభావవంతమైన ఆటగాడు అని చెప్పుకొచ్చాడు. జమాన్ రాణిస్తే పాకిస్థాన్ విజయం సాధిస్తుందని షాదాబ్ ధీమా వ్యక్తం చేశాడు. తమ జట్టులో ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారని తెలిపాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్‌లో జట్టు విజయానికి కీలకమైన బలమైన బౌలింగ్ ప్రదర్శనల ప్రాముఖ్యతను కూడా అతను నొక్కి చెప్పాడు. హైదరాబాద్ వాతావరణం, ప్లేయింగ్ కండిషన్స్ పాకిస్తాన్ లో ఉన్నట్టు ఉన్నాయని తెలిపాడు. ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండరీలతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం రావల్పిండిని తలపిస్తున్నాయని షాదాబ్ పేర్కొన్నాడు చెప్పాడు… ఉప్పల్ లోని పిచ్ డిఫరెంట్ గా ఉందన్నాడు.
Ramiz Raja: జట్టు ఆట తీరును మార్చుకోవాలి.. సొంత టీమ్పై పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
ఇక హైదరాబాద్ గురించి మాట్లాడితే.. ఇక్కడి ఆతిథ్యం బాగా నచ్చిందని తెలిపాడు. ఇక్కడి ఫుడ్ చాలా రుచికరంగా ఉందని చెప్పాడు. కచ్చితంగా తాము బరువు పెరుగుతామని తెలిపాడు. ఇలాంటి ఆతిథ్యమే అహ్మదాబాద్ లోనూ ఉంటుందని పాకిస్తాన్ నుంచి తాము ఆశిస్తున్నట్లు షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. టీమిండియా గురించి మాట్లాడితే.. రోహిత్ శర్మ తనకు ఇష్టమైన బ్యాట్స్మెన్ అని.. తను ఫామ్ లో ఉన్నాడంటే తనని అడ్డుకోవడం చాలా కష్టమన్నాడు. ఇక బౌలర్ కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడని అన్నాడు. ఒక స్పిన్నర్ కి ఫ్లాట్ ట్రాక్స్ మీద వేయడం అనేది చాలా కష్టమైన విషయం.. కానీ కుల్దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. ముఖ్యంగా భారత జట్టు వరల్డ్ కప్ లో విజయం సాధించేందుకు బెటర్ బౌలింగ్ అనేది దోహదపడుతుందని షాదాబ్ అన్నాడు.