ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఇవాళ ఒకే రోజు 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు. అంతకుముందు 2010 ఆసియా గేమ్స్‌లో భారత్ 11 పతకాలు సాధించగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది.
ఆసియా క్రీడలు 2014లో భారత్ 10 పతకాలు సాధించింది. కాగా.. జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 10 పతకాలు సాధించింది. ఇవాళ పాత రికార్డును భారత్ చెరిపేసింది. ఇక.. ఆసియా క్రీడలు 2023లో భారత్ ఇప్పటివరకు 13 బంగారు పతకాలు సాధించింది. అందులో భారత ఆటగాళ్లు 19 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. 19 కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటివరకు భారత్ 51 పతకాలు సాధించి నాలుగో స్థానంలో ఉంది.
ఇక పతకాల సంఖ్య గురించి మాట్లాడితే.. ఆతిథ్య చైనా నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు చైనా మొత్తం 242 పతకాలు సాధించింది. 131 బంగారు పతకాలు, 72 రజత పతకాలు, 39 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచింది.