డేవిడ్ భాయ్ బ్యాటింగ్లో ఇరగదీస్తాడన్న విషయం అందరికి తెలుసు. కానీ బౌలింగ్ కూడా చేస్తాడన్నది ఎవ్వరికి తెలియదు. అతని బౌలింగ్ చూస్తే.. అచ్చం రెగ్యూలర్ బౌలర్ లానే కనపడ్డాడు. ప్రస్తుతం వార్నర్ బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్జ్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో కెప్టెన్ కమ్మిన్స్ వార్నర్ భాయ్ కు బౌలింగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా జట్టు అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో వినూత్న ప్రయోగం చేశారు. కేవలం ఒక్క డేవిడ్ వార్నరే కాదు.. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌తో కూడా కెప్టెన్ బౌలింగ్ వేయించాడు. అయితే వీరు వేసిన బౌలింగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు చితకబాదుడు బాదారు. వీరు ముగ్గురు కలిపి 14.4 ఓవర్లు వేసి ఏకంగా 159 పరుగులిచ్చారు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన వార్నర్.. ఏకంగా 41 పరుగులిచ్చాడు.
మరోవైపు వార్నర్ వేసిన బౌలింగ్ వైడ్‌లైన్‌తో సంబంధం లేకుండా వేశాడు. ఓ బంతిని అయితే ఏకంగా వికెట్ కీపర్ పైకి విసిరాడు. వార్నర్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఆసీస్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఆ్రస్టేలియా.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇన్‌గ్లిస్ (48), వార్నర్ (48), లబుషేన్ (40), మిచెల్ మార్ష్ (31) అదరగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా టీమిండియాతో తలపడనుంది.