Leading News Portal in Telugu

Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌!


Anushka Sharma Instagram Post Goes Viral Amid Pregnancy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క మరోసారి తల్లి కానుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు అనుష్క కానీ.. ఇటు విరాట్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ మధ్య అనుష్క కనిపించకపోవడం, విరాట్ ఉన్నపళంగా భారత జట్టును వీడి ముంబై రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ప్రెగ్నెంట్ రూమర్స్ నేపథ్యంలో అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ కొటేషన్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిప్రాయాలు, తీర్పుకు సంబంధించిన ఓ కొటేషన్‌ను అనుష్క షేర్ చేశారు. ‘అభిప్రాయాలు వ్యక్తిగత దృక్కోణం నుంచే వస్తాయని మీరు అర్థం చేసుకున్నప్పుడు.. వాటి జడ్జిమెంట్‌ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది’ అని అనుష్క రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఓ ఫొటోను కూడా జత చేశారు.

అనుష్క శర్మ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో ఓ ప్రసూతి ఆసుపత్రి వద్ద విరాట్‌ కోహ్లీతో కలిసి అనుష్క కనిపించారని.. తమను ఫొటోలు తీయొద్దని మీడియాను కోరినట్లు పేర్కొన్నాయి. ఈ విషయం గురించే (వ్యక్తిగత స్వేచ్ఛ) అనుష్క ఇన్‌స్టాలో కొటేషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ 2017లో కోహ్లీని అనుష్క వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో విరుష్క జోడి కుమార్తె వామికకు జన్మనిచ్చారు. అనుష్క త్వరలో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో కనిపించనున్నారు. ఈ సినిమా భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అన్న విషయం తెలిసిందే.