Leading News Portal in Telugu

Fastest century: ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు.. 29 బంతుల్లోనే సెంచరీ


మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఈ ఘనత సాధించాడు.

టాస్మానియా జట్టు కెప్టెన్ జోర్డాన్ సిల్క్ 85 బంతుల్లో 116 పరుగులు చేయగా.. కాలేబ్ జ్యువెల్ 52 బంతుల్లో 90 పరుగులు చేశాడు. మకాలిస్టర్ రైట్ 31 బంతుల్లో 51 పరుగులు చేయగా.. 50 ఓవర్లలో 435/9 పరుగులు చేశారు. ఫ్రేజర్ మెక్ గుర్క్ తన జట్టును 3.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకోగా.. ఏడు ఓవర్లలో 100 పరుగుల మార్కు చేరుకున్నాడు. కేవలం 18 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అర్థసెంచరీ చేశాడు. ఆ తర్వాత 29 బంతుల్లో ఆరు ఫోర్లు, 12 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఏదేమైనప్పటికీ 50 ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్ ఇతడే.

కేవలం 38 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 328.94 స్ట్రైక్ రేట్‌తో అతను పరుగులు చేశాడు. ఫ్రేజర్ ఔటయ్యే సమయానికి దక్షిణ ఆస్ట్రేలియా కేవలం 11.4 ఓవర్లలో 172/1తో ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నాథన్ మెక్‌స్వీనీ 62, డేనియల్ డ్రూ 52, హెన్రీ హంట్ 51 పరుగులు చేసినప్పటికీ.. దక్షిణ ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 398 పరుగులకు ఆలౌటైంది. దీంతో 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.