Anil Kumble: నిన్న జరిగిన వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో కలిసి రాహుల్.. నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతేకాకుండా.. మ్యాచ్ను సిక్సర్ కొట్టి ముగించాడు. కేఎల్ రాహుల్.. 8 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 97 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రాహుల్ ఇన్నింగ్స్‌పై భారత మాజీ వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తన అసలు రంగులోకి వచ్చాడని అన్నాడు.
‘ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో’లో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. KL రాహుల్ తన అసలు రంగులోకి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుందన్నాడు. అతను మైదానంలో ఏమి చేయగలడో తనకు తెలుసన్నారు. రాహుల్ తన పాత్రను బాగా అర్థం చేసుకున్నారని కుంబ్లే అన్నారు. అతనికి స్పిన్ ఆడగల అద్భుతమైన సామర్థ్యం ఉందని.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా తనకు ఇది చాలా అవసరమని చెప్పాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఇతర బ్యాట్స్‌మెన్‌లకు బంతిని ఫోర్లు, సిక్సర్లు కొట్టే సత్తా ఉంది.. కానీ 50 ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని, షరతుల ప్రకారం ఎక్కువసేపు ఆడటం కష్టమని తెలిపాడు.
రాహుల్ 2023లో ఇప్పటివరకు 13 వన్డే ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసాడు. అందులో అతను 78.50 సగటుతో 628 పరుగులు చేసాడు. ఈ సమయంలో అతను 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలు సాధించాడు.