IND vs AFG: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. భారత్‌కు 273 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అఫ్గాన్ బ్యాటర్లు హష్మతుల్లా షాహీది(80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) బ్యాటింగ్‌లో రాణించడంతో అఫ్గాన్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా రెండు వికెట్లు తీశాడు. శార్దూల్, కుల్దీప్ తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.