Leading News Portal in Telugu

PAK vs SL: శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు.. వరుసగా రెండో విజయం అందుకున్న పాక్


వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ ఓడిపోయిన సందర్భాలేవు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 344 పరుగులు చేసినప్పటికీ పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని అధిగమించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ సెంచరీలతో చెలరేగడంతో విజయాన్ని పొందారు. రిజ్వాన్ 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 134 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. షఫీక్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 (103) పరుగులు చేశాడు.

Mark Antony: మార్క్ ఆంటోనీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ సెంచరీలు చేశారు. అయినప్పటికీ వారి సెంచరీలు వృథా అయ్యాయి. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాక్‌ జట్టు ఆదిలోనే తడబడింది. నాలుగో ఓవర్లో ఇమామ్ ఉల్ హక్ (12) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. 8వ ఓవర్లో కెప్టెన్ బాబర్ ఆజం (10) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రిజ్వాన్, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 176 (156) పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 213 పరుగుల స్కోరు వద్ద అబ్దుల్లా షఫీక్ ఔటయ్యాడు.

Israel: హమాస్ ఉగ్రవాదుల దుశ్చర్య.. ఒకే చోట 40 మంది చిన్నారులను హత్య

ఆ తర్వాత ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్ 30 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. 45వ ఓవర్ మూడో బంతికి షకీల్ ఔట్ కాగా.. ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ 22* పరుగులతో రాణించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక బౌలింగ్ లో మధుశంక 2 వికెట్లు తీశాడు. మహిష్ తీక్షణ, మతిషా పతిరనా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ శ్రీలంక ఓడిపోవడంతో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.