Leading News Portal in Telugu

Virat Kohli: శార్దూల్కు కోహ్లీ చేతుల మీదుగా పతకం.. ఇంతకీ దేనికంటే..?


Virat Kohli: శార్దూల్కు కోహ్లీ చేతుల మీదుగా పతకం.. ఇంతకీ దేనికంటే..?

Virat Kohli: వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద డే’గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కు ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే’ బిరుదు ఇచ్చింది. అయితే అందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్‌లో కింగ్ కోహ్లీ స్వయంగా తన చేతులతో శార్దూల్‌కు పతకాన్ని అందించాడు. శార్దూల్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా ఈ పతకం లభించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌లో శార్దూల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీనికి బీసీసీఐ అతనికి ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే’ బిరుదు ఇచ్చింది.

శార్దూల్‌కు బీసీసీఐ పతకాన్ని అందించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో మొదటగా.. జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆటగాళ్లందరూ అద్భుతమైన ప్రయత్నాలను ప్రశంసించారు. ఆ తర్వాత శార్దూల్‌ను పతకానికి నామినేట్ చేశాడు. దీంతో కోహ్లీ శార్దూల్‌కు పతకాన్ని అందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ స్లిప్‌లో మిచెల్ మార్ష్ డైవింగ్ క్యాచ్ పట్టినందుకు విరాట్ కోహ్లీకి పతకం లభించింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతికి కోహ్లీ క్యాచ్ పట్టాడు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నుంచి గట్టి ఫీల్డింగ్ కనిపించింది.