Leading News Portal in Telugu

Quinton De Kock: డికాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు..!


Quinton De Kock: డికాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు..!

వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు. దీంతో జట్టుకు శుభారంభాన్ని అందించగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 29.5వ ఓవర్లో ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది సెంచరీ పూర్తి చేశాడు.

Botsa Satyanarayana: త్వరలో డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన

ప్రపంచకప్‌-2023లో క్వింటాన్ డికాక్ వరుసగా రెండోసారి సెంచరీ సాధించాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌(4), హషీం ఆమ్లా(2), ఫాఫ్‌ డుప్లెసిస్‌(2), హర్షల్‌ గిబ్స్‌(2)లు చేయగా.. డికాక్ కూడా రెండోస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా.. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ జాబితాలో హషీం ఆమ్లా 27 సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో హర్షల్‌ గిబ్స్‌(18)ను అధిగమించాడు.

Vijay Antony: విజయ్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ?

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు హర్షల్‌ గిబ్స్‌ 1999లో 101 పరుగులు చేశాడు. ఇప్పుడు డికాక్ ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. మరోవైపు ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్‌ డుప్లెసిస్‌(2019) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాపై డికాక్ ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో ఎయిడెన్‌ మార్కరమ్‌ అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ బావుమా 35, క్లాసెన్ 29 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది.