
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. మిచెల్ మార్ష్ 7 పరుగులకే ఔట్ కాగా.. డేవిడ్ వార్నర్ 13 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వికెట్ల పతనం ఆగలేదు. జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్.. ఇలా వరుసగా ఐదుగురు బ్యాట్స్‌మెన్లు 65 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత 70 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆసీస్ జట్టులో మార్నస్ లాబుస్చాగ్నే పోరాడినప్పటికీ కొంత స్కోరు ముందుకు కదిలింది. మిచెల్ స్టార్క్, లాబుస్చాగ్నే మధ్య 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ 51 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 10 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో యూన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సీ తలో వికెట్ తీశారు.
Shoaib Akhtar: బాబర్ ఆజంపై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డి కాక్ 106 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రామ్ 44 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ 2-2 వికెట్లు తీశారు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో ఒక వికెట్ సాధించారు. ఇదిలా ఉంటే.. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత మ్యాచ్ అక్టోబర్ 16న శ్రీలంకతో తలపడనుంది.
AP Govt: సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్
కాగా.. వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో శ్రీలంకతో102 పరుగుల భారీ తేడాతో గెలిచారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పై అంతకుమించిన తేడాతో గెలవడంతో సఫారీల నెట్ రన్ రేట్(2.360) అమాంతం పెరిగింది. ప్రస్తుతం వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి ఎగబాకింది.