
Shoaib Akhtar: 2023వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశించినంత ప్రదర్శన చూపించడం లేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఫామ్‌పై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం మరోసారి ఫ్లాప్ అయ్యాడని అన్నాడు. బాబర్ ఆజం విఫలమైనప్పటికీ.. మంచి ఫాంలో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని తెలిపాడు. బాబర్ ఆజం లాగా ప్రదర్శన చేసే బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ ఉన్నాడని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాబర్ ఆజం గొప్ప ఆటగాడే అయినప్పటికీ.. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో పరుగులు రాణించాలని అన్నాడు. రాబోయే మ్యాచ్‌లలో బాబర్ ఆజం ఖచ్చితంగా కమ్ బ్యాక్ అవుతాడని, మంచి ప్రదర్శన చూపిస్తాడని చెప్పాడు.
రాబోయే మ్యాచ్‌ల్లో బాబర్ ఆజం కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ బౌలర్లపై ఎలాంటి విమర్శలు చేయలేదు. తాను తన బౌలర్లకు అండగా ఉంటానని చెప్పాడు. బౌలర్లు కూడా త్వరలో పుంజుకుంటారని.. ప్రస్తుతం తమ బౌలర్లు వన్డే ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేరని చెప్పాడు. వన్డే ఫార్మాట్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడమంటే మాములు విషయం కాదన్నాడు.
ఇదిలా ఉంటే.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.