Leading News Portal in Telugu

Shubman Gill: టీమిండియాకు శుభవార్త.. నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్


Shubman Gill: టీమిండియాకు శుభవార్త.. నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్

Shubman Gill: వరల్డ్ కప్ 2023 ప్రారంభంకు ముందే టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో జట్టు ఆడిన రెండు మ్యాచ్లకు అతను దూరమ్యాడు. అయితే అప్పటి నుంచి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందగా.. తాజాగా కోలుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గిల్ నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో శుభ్మాన్ గిల్ బరిలోకి దిగితే టీమిండియాకు శుభవార్తే.

ఈ నెల 14న టీమిండియా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్ తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ నాటికి గిల్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. డెంగీ కారణంగా ప్లేట్ లెట్లు తగ్గడంతో, గిల్ కు అందుకు తగిన చికిత్స అందించారు. గిల్ ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్ నెస్ రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసమని పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడటం కష్టమే అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. గిల్ స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ తో విఫలం కాగా.. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫాంలోకి వచ్చాడు.

ఇక టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, పాక్ తో మ్యాచ్ కు గిల్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.