
HCA Announce Hyderabad Cricket Team for Syed Mushtaq Ali Trophy: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బంపరాఫర్ కొట్టేశాడు. ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తిలక్ ముందుండి నడిపించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తాజాగా హెచ్‌సీఏ అధికారులు ప్రకటించింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మను ప్రకటించారు.
ప్రస్తుతం తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2023లో తిలక్ రాణించాడు. అంతకుముందు వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హెచ్‌సీఏ తిలక్‌కు అప్పగించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి ఆరంభం అవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా వెటరన్ ప్లేయర్స్ అజింక్య రహానే, భువనేశ్వర్ కుమార్ సహా.. యువ ఆటగాళ్లు రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్ పాల్గొననున్నారు.
హైదరాబాద్ టీ20 జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ది, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, చందన్ సహని, భవేశ్ సేథ్, రవితేజ, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు.