Leading News Portal in Telugu

KS Bharat: టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్‌కు ఏపీ ప్రభుత్వం వరాలు!



Ks Bharat

AP Govt Offers Group-1 Post to Crickter KS Bharat: టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్‌పై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గ్రూప్-1 ఆఫీసర్ ఉద్యోగంతో పాటు వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చింది. ‘కేర్ ఫర్ క్రికెట్’ ఆధ్వర్యంలో కేఎస్ భరత్‌కు ఈరోజు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్‌కు గ్రూప్-1ఆఫీసర్ ఉద్యోగం, వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా రాష్ట్రంలో క్రీడల పండుగను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో యువతకు ఐదు లక్షల క్రికెట్ కిట్లు పంపినీ చేస్తాం. మూడు వందల కోట్లతో నూతన క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.

Also Read: IND Playing XI PAK: గిల్ రీఎంట్రీ.. సిరాజ్ డౌట్! పాకిస్థాన్‌తో తలపడే భారత్ తుది జట్టిదే

గత జూన్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆడిన కేఎస్ భరత్.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడు. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని సీఎంకు భరత్‌ బహుకరించాడు. అనంతరం ఇద్దరూ రాష్ట్రంలో క్రికెట్ పరిస్దితిపై చర్చించారు. ఇక భారత్ జట్టు తరఫున 5 టెస్టులు ఆడిన కేఎస్ భరత్.. 129 రన్స్ చేశాడు.