Leading News Portal in Telugu

NZ vs BAN: వరుసగా మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం.. బంగ్లాపై 8 వికెట్ల తేడాతో గెలుపు


NZ vs BAN: వరుసగా మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం.. బంగ్లాపై 8 వికెట్ల తేడాతో గెలుపు

వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై తన జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. డారిల్ మిచెల్ 89* పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా.. కెప్టెన్ విలియమ్సన్ 78 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్, కెప్టెన్ షకీబ్ తలో వికెట్ తీశారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇది వరుసగా మూడో విజయం.

Shaalini Pande : మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న విజయ్ బ్యూటీ..

ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ను ఎంచుకుంది. అద్భుతమైన బౌలింగ్ తో బంగ్లాదేశ్‌ను 50 ఓవర్లలో 245/9 పరుగులకు పరిమితం చేసింది. కివీస్ జట్టులో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ తలో రెండేసి వికెట్లు తీశారు. 246 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర 9 పరుగులు (13 బంతుల్లో) చేసి ఔటయ్యాడు. తర్వాత మూడో స్థానంలో వచ్చిన కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వేతో కలిసి 80 (105 బంతులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 3 ఫోర్ల సహాయంతో 45 (59) పరుగులు చేసిన తర్వాత డెవాన్ కాన్వే షకీబ్ అల్ హసన్‌ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరుకున్నాడు.

Vrushabha: ముంబైలో ‘వృషభ’ కొత్త షెడ్యూల్.. రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఖరారు

కెప్టెన్ కేన్ విలియమ్సన్ 107 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 78* పరుగులు చేసిన తర్వాత 39వ ఓవర్లో రిటైర్డ్ అయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి విలియమ్సన్ మూడో వికెట్‌కు 108* (109 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత.. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ కొట్టి 16* పరుగులు చేశాడు. మరోవైపు డారిల్ మిచెల్ 67 బంతుల్లో 6 ఫోర్లతో 89* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కివీస్ జట్టు వరుసగా మూడో మ్యాజ్ లో విజయాన్ని అందుకుంది. ఇక బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో.. రెండు ఓడిపోగా, ఒకటి గెలిచింది.